అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
గద్వాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇస్తుందని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు, సంగీత నాటక ఆకాడమి చైర్‌పర్సన్ అలేఖ్య ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారరని, ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంతో మహిళలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అర్హులకు గ్యాస్ సిలిండర్ రూ.500కి, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రూ.31 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసి అన్నదాతలపై ఉన్న చిత్తశుద్దిని చాటుకుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తోందని చెప్పారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పరంగా ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో సామాజిక, ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ కోసం ఇంటింటి సమగ్ర సర్వే జరిపిస్తుందన్నారు. కార్యక్రమంలో అలంపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ మనోరమ, వడ్డేపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ కరుణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
అలంరించిన ప్రదర్శనలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండగల ప్రాముఖ్యతను చాటుతూ కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకం ప్రత్యేకంగా నిలిచింది. తెలంగాణ అమరవీరులు, కవులు, కళాకారులు, పల్లె సంస్కృతి, గ్రామ దేవతల బోనాలు, పోతురాజుల విన్యాసాలు, బతుకమ్మ వేడుకలను ప్రతిబింబిస్తూ తమ అభినయాలతో అలరించారు. అంతకు ముందు సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన పాటలు, నృత్యాలు ప్రజాపాలన విశిష్టతను చాటాయి. వివిధ ప్రదర్శనలతో ప్రాంగణమంతా సందడిగా మారింది.
అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ
ఘనంగా ప్రజాపాలన విజయోత్సవం
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
Comments
Please login to add a commentAdd a comment