కాసులు కురిపిస్తున్న రియల్ భూం
రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న గద్వాలతో పాటు అయిజ, వడ్డేపల్లి, ఉండవెల్లి, ఇటిక్యాల మండలాల్లో రెవెన్యూ అధికారులతో పాటు పంచాయతీ అధికారులకు కాసుల పంట కురిపిస్తున్నాయి. వ్యవసాయేతర భూమిగా మార్చడం కోసం రియల్ వ్యాపారులను ముప్పుతిప్పలకు గురిచేసి రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. భూ సర్వేలో అనధికారికంగా మండల సర్వేయర్‌కు ఒక రేటు, జిల్లా సర్వేయర్‌కు మరో రేటును ఫిక్స్ చేశారు. అయితే ఏసీబీ దాడులలో చిన్నపాటి ఉద్యోగులు, సిబ్బందే బలిపశువులు అవుతున్నారనే వాదన కూడా బలంగా ఉంది. రెవెన్యూ ఉన్నతాధికారులు, తహసీల్దార్ వంటి అధికారుల పాత్ర లేనిదే రెవెన్యూశాఖలో ఏ పని జరగదు. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని వారిద్వారానే వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ అధికారులు సైతం పట్టుబడిన క్రిందిస్థాయి అధికారులపైనే కేసులు నమోదు చేసి పైస్థాయి అధికారులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment