వైభవంగా అంజన్న రథోత్సవం
ధరూరు: మండలంలోని అల్వలపాడు తెలుగోనిపల్ల్లి ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామి వారి అలంకరణ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి రథోత్సవాన్ని రాత్రి 8 గంటలకు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా దాసంగాలు( నైవేద్యాలు) తయారు చేసి స్వామి వారికి సమర్పించుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు సర్పంచులు, ప్రతాప్, వీరన్నగౌడ్ నాయకులు జాంపల్లి వెంకటేశ్వరరెడ్డి, అర్చకులు వామనాచార్యులు, మద్వాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment