మంత్రి దృష్టికి ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్య
రాజోళి: ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్యను పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు శాంతినగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 20 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన క్రమంలో సమస్యను పరిష్కరిస్తామని సంపత్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు దీక్షలను విరమించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సంపత్‌కుమార్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని కలవనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు బాబురావ్, రఘువర్ధన్ రెడ్డి, మధు రెడ్డి, మన్సూర్, దేవన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment