గద్వాల: జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికో ఇందిరమ్మ నమూనా గృహాన్ని నిర్మించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపి గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి ఐడీవోసీ కార్యాలయంలో కలెక్టర్ బీఎం సంతోష్‌తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిమండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఇందిరమ్మ మోడల్ గృహాలను అత్యాధునిక సాంకేతికతతో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ లబ్ధిదారులకు ఆదర్శంగా నిలిచే విధంగా నిర్మించి వీలైంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులు నిర్మించుకునే ఇళ్ల నిర్మాణపు పనులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారుల ఖాళీస్థలం, బేస్‌మెట్ వరకు ఫొటోలను గ్రామ కార్యదర్శులు యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అంతకు ముందు దౌదర్‌పల్లి సమీపంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, హౌసింగ్ సీఈ చైతన్య,ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment