మచ్చుకు మరికొన్ని.. | - | Sakshi
Sakshi News home page

మచ్చుకు మరికొన్ని..

Published Tue, Feb 18 2025 1:59 AM | Last Updated on Tue, Feb 18 2025 1:59 AM

-

● జమ్మిచేడు శివారులోని సర్వే నంబర్‌ 389లో ఉన్న లేఅవుట్‌లోని పది శాతం స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించారనే దానిపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఇంత వరకు చర్యలు లేకపోవడం గమన్హారం.

● కొత్తహౌసింగ్‌ బోర్డు కాలనీకి ఆనుకొని సర్వేనంబర్‌ 789లోని ఎల్‌పీలో నాలుగు గుంటల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వదిలారు. ఈ ఖాళీ స్థలంతో పాటు 40 అడుగుల రోడ్డును కొంతమంది కబ్జాచేసి ప్లాట్లుగా డాక్యుమెంట్లు సృష్టించారు. కబ్జాకు గురైన ఆ స్థలం బహిరంగ మార్కెట్‌లో రూ.4 కోట్లు ఉంటుంది. దీనిపై స్థానికులు అభ్యంతరం తెలిపి, ఫిర్యాదు చేసినా నేతల బలం ముందు ఫలితం లేకుండా పోయింది.

● రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికుల వర్క్‌షాప్‌ కోసం ఇచ్చిన స్థలం సైతం కబ్జాకు గురైందని బాధితులు ఫిర్యాదు చేశారు. వాటిపైనే చర్యల లేవు.

● ముఖ్యంగా 2వ, 6వ వార్డుల పరిధిలోని ప్రజా అవసరాల స్థలంలో ఆర్థిక, రాజకీయ బలం ఉన్న కొంత మంది నాయకులు నిబంధనలు ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తులు నిర్మించారు. వాటిపైనే చర్యలు కరవయ్యాయి.

● 34వ వార్డులోని కుంటవీధిలో ప్రజా అవసరాల స్థలంలో నకిలీ డాక్యుమెంట్లతో చేపట్టిన అక్రమ నిర్మాణం యేథేచ్ఛగా సాగుతుంది. కలెక్టర్‌ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. మున్సిపల్‌ అధికారులు అయితే వెళ్లడానికి సైతం జంకుతున్నారు. ఈ నేపథ్యంలో టాస్కుఫోర్సు కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులపైనే టాస్కుఫోర్సు తన ప్రతాపాన్ని చూపుతుందనే ఆరోపణలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement