బీచుపల్లిని సందర్శించిన ఎంపీ మల్లురవి
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని సోమవారం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లురవి సందర్శించారు. ఈ సందర్బంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకుడు మారుతి చారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు మధుసూదన్‌రెడ్డి, రంగారెడ్డి, గట్టు తిమ్మప్ప తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment