కేసీఆర్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి
గద్వాల టౌన్/అలంపూర్/అయిజ: కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ పిలుపు మేరకు సోమవారం మొక్కలు నాటారు. అనంతరం మా ట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం మళ్లీ కేసీ ్డఆర్ సీఎం కావాలని ఆకాంక్షించారు. అంతకుముందు కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని నిత్యాన్నదాన సత్రాన్ని పరిశీలించారు. అలాగే అత్యవసర సమయాల్లో రోగులకు రక్తదానం చేసి ప్రాణదాత లు అవ్వాలని అన్నారు. సోమవారం అయిజలో రక్తదా న శిబిరం ఏర్పాటుచేయగా.. దానిని ప్రారంభించారు.
రక్తదానం చేస్తే పునర్జన్మనిచ్చినట్లే
రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మను ఇచ్చినట్లేనని బీఆర్‌ఎస్ నాయకులు బాసు శ్యామల, హనుమంతునాయుడు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం పలు చోట్ల ఏర్పాటు చేసిన అన్నదానం, పండ్ల పంపిణీ, మొక్కల నాటడం వంటి సేవా కార్యక్రమాలకు హజరయ్యారు. విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
కేసీఆర్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి
Comments
Please login to add a commentAdd a comment