ఆగని అవినీతి
కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా ఠంచన్‌గా జీతాలు పొందుతున్నా.. కొందరు ఉద్యోగులు ధనార్జనే ధ్యేయంగా అవినీతికి తెరలేపారు. ఫైలు ముందుకు కదలాలన్న.. పని పూర్తి కావాలన్నా.. ప్రతి పనికో రేటు చొప్పున చేయి తడపాల్సిందే. దీంతో కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిన కొందరు బాధితులు ఎంతో కొంత నగదు ముట్టజెబుతుండగా.. మరికొందరు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. అడపాదడపా ఏసీబీ ఉచ్చులో అధికారులు చిక్కుతున్నారు. అయినా కూడా మిగతా వారిలో మార్పు రావడంలేదు. పైపెచ్చు అవినీతిని కొంత పంథాలో కొనసాగిస్తూ.. మధ్య దళారులతో వ్యవహారం నడిపిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment