అలంపూర్: తరగతి గదిలోనే విద్యార్ధి భవిష్యత్ దాగి ఉందని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, మోటివేషన్ స్పీకర్ రవీందర్ అన్నారు. సోమవారం అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, పదో తరగతి ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్ధికి లక్ష్యం, గమ్యం తప్పక ఉండాలని, ఒకరు చెబితే చదవడం కంటే చదవాలనే ఆసక్తి ఆత్రుత ఉన్నప్పుడే విద్యార్ధి ఉన్నత స్థాయిలో రాణిస్తారన్నారు. ప్రభుత్వం, దాతలు అందించే సౌకర్యాలను అంది పుచ్చుకోవాలని, పదో తరగతి విద్యార్థులు 10కి 10 గ్రేడ్ సాధించాలని అనారను. కార్యక్రమంలో చిన్నయ్య, రాముడు, అమరేందర్‌రెడ్డి, బలగం నాగరాజు, భరత్, నాగరాజు, శ్రీకాంత్, నాగశేషన్న ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment