
టమాటా.. నష్టాలబాట
మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు రాక రైతుల దిగాలు
పంట తీసివేశా..
ఏటా అరెకరాలో టమాటా పండిస్తాను. ఈసారి కూడా సాగుచేశాను. డిసెంబర్‌లో చేతికి వచ్చిన టమాటాను మార్కెట్‌కు తీసుకువెళ్తే కొంత రేట్లు వచ్చాయి. జనవరిలో ఽకనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాలేదు. చేసేది లేక పంట వదిలేశా.
– శివ, రైతు, ధరూర్
నష్టం వచ్చింది..
ఎకరా పొలంలో టమా టా సాగుచేశాను. రూ. 18వేల వరకు ఖర్చయ్యింది. జనవరిలో రేట్లు పూర్తిగా పడిపోయాయి. టమాటా తెంపి న కూలీల ఖర్చులు కూడా రాలేదు. టమాటా సాగుతో ఆర్థికంగా నష్టం వాటిల్లింది.
– వెంకటన్న, రైతు,
షాబాద్, ఇటిక్యాల మండలం
ధరలు పెరిగే అవకాశం ఉంది..
టమాటాకు గత జనవరిలో ధరలు రాలేదు. స్థానికంగా సాగు అయిన టమాటాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడి మార్కెట్‌కు రావడంతో ధరలు తగ్గాయి. అయితే మూడు, నాలుగు రోజుల నుంచి కొంతమేర ధరలు పెరిగాయి. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
– ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖాధికారి
గద్వాల వ్యవసాయం: వ్యయప్రయాసాలకోర్చి పండించిన టమాటాకు మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కూలీల ఖర్చులు కూడా రాక అల్లాడుతున్నారు. ప్రతి ఏటా నెల నుంచి రెండు నెలలపాటు ధరలు పూర్తిగా పడిపోతుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. టమాటా తెంపేందుకు కూలీల ఖర్చు, రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో సాగు ఇలా..
జిల్లాలో ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లో బోరుబావుల కింద కూరగాయల సాగులో భాగంగా టమాటా పండిస్తున్నారు. ధరూర్, మల్దకల్, గద్వాల, ఇటిక్యాల, అయిజ, వడ్డేపల్లి, మండలాల్లో టమాటను ఎక్కువగా సాగుచేస్తారు. టమాటా విత్తిన నాటి నుంచి 55 – 60 రోజులకు చేతికి వస్తుంది. ఎకరాకు రూ. 15వేల నుంచి రూ. 18వేల వరకు ఖర్చు అవుతోంది. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత టమాటా తెంపడానికి ఒక కూలీకి రోజుకు రూ.400, మార్కెట్‌కు తరలించడానికి ఒక బాక్స్‌కు రూ. 20 నుంచి రూ. 40 వరకు వెచ్చిస్తున్నారు.
ఎకరాకు 20 టన్నుల దిగుబడి..
వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. దీంతో బోరుబావులు రీచార్జ్ అయ్యాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా కూరగాయల సాగులో భాగంగా 352 ఎకరాల్లో రైతులు టమాటా సాగుచేశారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది.
20 కేజీల టమాటా బాక్స్‌కు వచ్చిన ధరలు ఇలా..
నెల ధర (రూ.పాలలో)
డిసెంబర్ 400 నుంచి 450
జనవరి 100 నుంచి 150
ఫిబ్రవరి 200 నుంచి 220

టమాటా.. నష్టాలబాట

టమాటా.. నష్టాలబాట

టమాటా.. నష్టాలబాట
Comments
Please login to add a commentAdd a comment