
పథకాల అమలు తీరుపై కేంద్ర బృందం ఆరా
మల్దకల్: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కేంద్ర బృందం సభ్యులు రెండో రోజైన బుధవారం మండలంలోని శేషంపల్లిలో పరిశీలించారు. ఈసందర్భంగా కేంద్ర బృందం సభ్యులు దీపక్ వర్మ, అమిత్ వర్మ, మహేష్‌లాల్, మయాంక్, రంజాన్‌పాల్ గ్రామంలో స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలతోపాటు సెగ్రిగేషన్ షెడ్లు, పింఛన్ల అమలుపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై పరిశీలన చేపట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందివ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయ రెడ్డి, ఎంపీఓ రాజశేఖర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ నాగరాణి, పంచాయతీ కార్యదర్శి రూపరాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment