ఎర్రవల్లి: మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో బుధవారం పవమాన హోమాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. విశ్వ హిందూపరిషత్ మరియు వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి దంపతులు పాల్గొని భక్తిశ్రద్ధలతో హోమ పూజలు చేశారు. అనంతరం ఆరు గ్రామాలకు చెందిన గ్రామ కమిటీ సభ్యులు ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేపట్టి భక్తులకు సనాతన ధర్మం యొక్క విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిద సంఘాల నాయకులు సత్యం, నర్సింహ, అర్చకులు, కమిటీల సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
20న పేటెంట్ రైట్స్‌పై అవగాహన సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 20న పేటెంట్ రైట్స్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పీయూలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేటెంట్ రైట్ పొందే వారు ఏ విధంగా నమోదు చేసుకోవాలి.. అందులో ఎదురయ్యే సవాళ్లు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. ముఖ్య వక్తగా శంకర్‌రావు ముంజం హాజరవుతారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు, అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చైర్మన్ చంద్రకిరణ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, కోకన్వీనర్ మధు, క్రైటీరియ కోఆర్డినేటర్ కరుణాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్, గాలెన్న తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఒరిజినల్ రశీదులు ఇవ్వాలి
ఎర్రవల్లి: ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా ఒరిజినల్ రశీదులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కోదండాపురంలో పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి స్టాక్ నిల్వలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు గల ఎరువులను మాత్రమే డీలర్లు విక్రయించాలని అన్నారు. ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలన్నారు. ప్రతి రోజు తప్పకుండా ఈ పాస్ మిషన్‌లో స్టాక్ వివరాలను అప్‌డేట్ చేయాలన్నారు.
జిల్లాలో యాసంగిలో 54,918 ఎకరాల్లో వరి, 27,178 ఎకరాల్లో మొక్కజొన్న, 8,070 ఎకరాల్లో వేరుశనగ, 8,945 ఎకరాల్లో పప్పుశనగ, 4,686 ఎకరాల్లో మినుము, 4,686 ఎకరాల్లో జొన్న వంటి పంటలను సాగు చేసే అవకాశం ఉందన్నారు. ఈ పంటలకు అవసరమైన 16,704 టన్నుల యూరియా, 817 టన్నుల డీఏపీ, 2,363 టన్నుల పొటాష్, 14,457 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలోని వివిధ ఎరువుల దుకాణాలు, మార్క్‌ఫెడ్ గోదాముల నందు రైతులకు అందుబాటులో ఉంచామని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవికుమార్, తదితరులు ఉన్నారు.

బీచుపల్లిలో వైభవంగా పవమాన హోమం
Comments
Please login to add a commentAdd a comment