గద్వాలటౌన్ : ఈ నెల 20 తేదీ నుంచి 23వ తేదీ వరకు వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలుర, బాలికల కబడ్డీ టోర్నమెంట్‌కు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డీకే స్నిగ్దారెడ్డి, కార్యదర్శి నర్సింహ తెలిపారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక ఇండోర్ స్టేడియంలో ఎంపిక పోటీలు ఉంటాయని, బాలురు 55 కేజీలు, బాలికలు 50 కేజీలలోపు బరువు ఉన్న కేటగిరిలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 2009 ఏప్రిల్ 1వ తేదీ తరువాత పుట్టినవారే ఎంపిక పోటీలకు అర్హులని, ఆధార్ కార్డు, పది మెమో వెంట తీసుకురావాలని, ఇతర వివరాలకు సెల్ నంబర్లు : 8919216300ను సంప్రదించాలన్నారు.
ఉన్నత లక్ష్యాలను
చేరుకోవాలి
మానవపాడు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు కష్టపడి చదవాలని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆీఫీసర్ ప్రియాంక అన్నారు. బుధవారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి స్కిల్ బెవలప్‌మెంట్, ఇంటర్, పాలిటెక్నిక్, మెడికల్ కోర్స్‌కు సంబందించి విద్యాసామార్థ్యలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించాలని సూచించారు. అనంతరం భోజన నాణ్యతను, ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఎంఈఓ శివప్రసాదు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment