గద్వాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి ఏకంగా రూ.2 కోట్లకు విక్రయించిన ఘటనపై అదనపు కలెక్టర్, గద్వాల మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి నర్సింగ్‌రావు స్పందించారు. సమగ్ర నివేదిక అందించాలని మున్సిపల్ కమిషన్‌ను ఆదేశించారు. ప్రభుత్వ స్థలం కబ్జా విషయమై ‘ప్రభుత్వ భూమినే అమ్మేశారు’ శీర్షికన 11వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురించిన విషయం విధితమే.
పట్టణంలోని సుంకులమ్మమెట్టు కాలనీలో మున్సిపాలిటీకి చెందిన సర్వే నంబర్ 452లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటికి తీసుకున్న రక్షణ చర్యల వివరాలను సమగ్ర నివేదిక అందించాలని మున్సిపల కమిషనర్ దశరథ్‌ను ఆదేశించారు. ఈ విషయం తెలియడంతో కబ్జాదారుల గుండెల్లో గుబులు పట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment