
మెరుగైన బోధన చేయాలి
గద్వాల: విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు, నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల మండలం పుటాన్‌పల్లి గ్రామంలో గిరిజన సంక్షేమశాఖ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వంటగది, సిద్ధంగా ఉంచిన భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలన్నారు. విద్యార్థులతో సమస్యలపై ఆరా తీశారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదేవిధంగా పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment