
జీవితమే ముఖ్యం
ప్రేమపేరుతో ప్రాణాలు తీసుకోవద్దు.. తీయొద్దు
ప్రేమ అనేది రెండు మనసుల మధ్యన ఏర్పడే విడదీయరాని బంధం. ఇరువురిది ఒకేదారి అయినప్పుడే ఈ బంధం సాఫీగా సాగుతుంది. పెళ్లి అనే సరికొత్త జీవనం వైపు అడుగులు వేయించి భవిష్యత్ పునాదులకు బీజం వేస్తోంది. కానీ, ఇలాంటి ప్రేమ ప్రస్తుత రోజుల్లో తాత్కాలికమే అయింది. తెలిసీతెలియని వయసులో కొందరు ఆకర్షణకు లోనై.. మత్తులో మునిగి తేలుతున్నారు. మరికొందరు చిన్న వయసులోనే ప్రేమ పేరిట జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ ఎంతో బలమైందన్నది ఎంత నిజమో.. మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకున్న వారి జీవితం అంతే బలంగా.. సాఫీగా సాగుతుందన్నది అంతే నిజం. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రేమ వివాహాలు, ప్రేమ ముసుగులో జరుగుతున్న దారుణాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– మహబూబ్‌నగర్ క్రైం/ గద్వాల క్రైం
మిడిమిడి జ్ఞానంతో ప్రేమకు దగ్గరవుతున్న కొందరు పెళ్లి విషయం వచ్చేసరికి ఇల్లు విడిచి వెళ్తున్నారు. ఇలాంటి కేసులు ఏటా సుమారు 200 వరకు ఉంటున్నాయి. వీరిలో బాలికలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. చిన్నతనంలో కుటుంబ నేపథ్యం, సామాజిక స్థితిగతులు, ఆర్థికాంశాలు కూడా దోహదపడుతున్నాయి. గతేడాది జిల్లాలో 210కి పైగా అదృశ్య కేసులు నమోదయ్యాయి. డబ్బు ఉన్నా.. లేకపోయినా అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించుకోవడానికి.. కలిసి జీవించడానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీరిలో కొంతమంది తల్లిదండ్రులను ఒప్పిస్తే.. మరికొందరు ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు.
విడిపోతున్న జంటలు అధికమే
తెలిసీతెలియని వయసులో ప్రేమ వివాహాలు చేసుకుంటున్న జంటల్లో చాలామంది విడిపోతున్నారు. పట్టణ ప్రాంతాలకు చదువుకోవడానికి వస్తున్న అమ్మాయిలు ఆటోడ్రైవర్లు, ఇతర పోకిరీల ఉచ్చులో పడి మోసపోతున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకుంటున్న వారిలో మనస్పర్థలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇద్దరి మధ్య దూరం ఏర్పడి, విడాకులకు దారి తీస్తోంది. ఇలా ఏటా పదుల సంఖ్యలోనే జంటలు విడిపోతున్న దాఖలాలున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు, పెద్దలను ఒప్పించి ఒక్కటైన జంటలు సైతం చిన్నపాటి కారణాలకే విడిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. గతేడాది జిల్లాలో 15 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు.
ఒప్పుకోకపోతే దాడులు
మహబూబ్‌నగర్‌లో షీటీం నమోదు చేసిన కేసులు, కౌన్సెలింగ్ వివరాలు
వివాహానికి చట్టబద్ధంగా కనీస వయసు తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం నుంచి జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని ఆధారంగా చూపాల్సి ఉంటుంది. చట్టపరంగా యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, ఏ మాత్రం అవగాహన లేకుండా కేవలం ఆకర్షణకు లోనై ప్రస్తుతం చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే సమయంలో వయసు గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే యువతుల కనీస వయసు 18 ఏళ్లు నిండని పక్షంలో వారిని మైనర్లుగా భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మైనర్లను వివాహం చేసుకోవడం, పెద్దల అనుమతి లేకుండా తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. ఇలాంటి కేసుల్లో యువతి సమ్మతి లేకుంటే యువకుడిపై అత్యాచారం, అపహరణ కేసులు కూడా నమోదు చేస్తారు. ఒకవేళ యువతి సమ్మతి ఉంటే కనీస వయసు పూర్తయ్యే వరకు ఆమె ఇష్టానుసారం ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు.
ఒప్పుకోకపోతే యువతులపై దాడులు సరికాదు
పెద్దలు అంగీకరించకపోయినా ఆత్మహత్యలు
జిల్లాలో అమ్మాయిలు, మహిళలపై పెరుగుతున్న దాడులు

జీవితమే ముఖ్యం
Comments
Please login to add a commentAdd a comment