
‘అపార్’పై ప్రత్యేక దృష్టి సారించండి
అయిజ: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అపార్ ఐడీల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని.. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. గురువారం అయిజ ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా అపార్ ఐడీ క్రియేట్ చేసిన శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రయివేటు పాఠశాలలు వెనుకబడి ఉన్నాయని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ ప్లానింగ్ కోఆర్డినేటర్ శాంతిరాజు, మండల విద్యాధికారి రాములు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఉండవెల్లి: ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన బోధన అందించడమే కాకుండా ఎంఈఓలకు సహకరించాలని.. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి పాఠశాల గ్రాంట్స్‌ను వెంటనే రిలీజ్ చెయ్యాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో ఉన్న అన్ని సమస్యలను ఆ గ్రాంట్స్‌ను రిలీజ్ చేసి ఖర్చు పెట్టి పరిష్కరించాలని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయ్యాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియాల్ అధికారి శాంతిరాజ్, ఎంఈఓలు రామకృష్ణ, భగీరథ రెడ్డి, ఉపద్యాయులు తదితర్లు పాల్గోన్నారు.
ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ క్రియేట్ చేయాలి
అలంపూర్: ప్రతి విద్యార్ధి అపార్ ఐడీ ఖచ్చితంగా క్రియేట్ చేయాలని డీఈఓ మహ్మద్ అబ్దుల్ ఘని అన్నారు. అలంపూర్ చౌరస్తాలో విశ్వశాంతి డిగ్రీ కళాశాలలో అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు మండలాల ఎంఈఓలతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీఈఓ, సెక్టోరియల్ ప్లానింగ్ కో–ఆర్డీనేటర్ శాంతిరాజ్ హాజరై మాట్లాడారు. ఖచ్చితంగా ప్రతి విద్యార్ధి అపార్ ఐడీ క్రియేట్ చేయాలని, ఏమైన సమస్యలు ఉంటే ఎంఈఓలతో మాట్లాడి వంద శాతం పూర్తి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment