కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి మూడో తడి పంటలకు నీటిని విడుదల చేశారు.
వివరాలు 8లో u
చేయి తడపాల్సిందే..
లంచం కొట్టు.. పనిపట్టు అనే సూత్రాన్ని వంట పట్టించుకున్న సదరు రెవెన్యూ అధికారి అందరికీ ఇదే సూత్రాన్ని ఫాలో అవ్వమని సలహా ఇస్తున్నాడు. ఇందుకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
● గత ప్రభుత్వంలో మూడెకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని జిల్లా సమీపంలోని ఓ వ్యక్తికి కేటాయించారు. ఇతనికి ముగ్గురు సంతానం. కొద్ది కాలానికి సదరు వ్యక్తి మృతి చెందాడు. వాస్తవానికి వారసత్వం ప్రకారం ముగ్గురికి తండ్రి ఆస్తిలో సమానవాటా రావాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇది వరకే ఒకరు మృతి చెందడంతో మిగిలిన ఇద్దరి వద్ద రూ.4 లక్షల లంచం తీసుకుని ఇద్దరి పేరిట భూమిని రికార్డు చేశారు. మృతి చెందిన కుటుంబానికి అన్యాయం చేశాడని సదరు కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
● ఓ మండలంలోని ఇనామ్ భూమికి సంబంధించి రికార్డులో పేర్లు చేర్చేందుకు సదరు భూ యజమానితో రూ.1.50లక్షలు తీసుకుని రికార్డు చేసినట్లు తెలిసింది.
● అనంతపురం గ్రామశివారులో ఆరు ఎకరాలకు సంబంధించి రికార్డు పేర్లు మార్చేందుకు రూ.10లక్షల వరకు డీల్ చేసుకున్నట్లు జోరుగా ప్రచారం వినిపిస్తుంది. రెవెన్యూ అధికారి అవినీతిపై పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొద్దిరోజులు ఆగమని వారికి చెప్పినట్లు సమాచారం.
● ఇవేగాక రాత్రివేళలలో బైక్‌పై తనిఖీల పేరిట చక్కర్లు కొడుతూ అనుమతులు లేకుండా మట్టి, ఇసుక దందా చేసే వారి వద్ద పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం. అయితే దొరికిన వాహనాలకు చిన్నమొత్తంలో ఫైన్లు వేస్తూ ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారని సదరు అధికారి సిబ్బంది చెవులు కొరుక్కోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment