విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలి
ఇటిక్యాల: విద్యార్థులు పరీక్షలపై భయం వీడాలని.. క్రమశిక్షణతో చదివి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం మండలంలోని ఉదండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వివేక్ ట్రస్ట్ నుంచి పలు వస్తువులను పాఠశాలకు ఎస్పీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య లభిస్తుందని, విద్యార్థులు సేవాగుణంతో మెలిగి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరును తీసుకురావాలన్నారు. అనంతరం జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా పాఠశాలకు రూ.25 వేలను అందించారు. అనంతరం వివేక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి భీమన్న మాట్లాడుతూ చదువు ద్వారానే గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్‌ను మారుస్తుందని అన్నారు. పాఠశాలకు రూ.40వేల విలువ గల సామగ్రిని అందించడం జరిగిందన్నారు. పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులకు రూ.10 వేల నగదును అందిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సిఐ రవిబాబు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎస్ వెంకటేష్, హెచ్‌ఎంలు రెడ్డినాయక్, నాగరాజ్, పాఠశాల చైర్మెన్ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment