న్యాయవాదుల విధుల బహిష్కరణ
అలంపూర్: రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై దాడి ఘటనను ఖండిస్తూ శుక్రవారం అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపి విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ...రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తున్న క్రమంలో జీర్ణించుకోలేని ముద్దాయి న్యాయమూర్తిపై దాడికి పాల్పడినట్లు అందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి పై దాడి న్యాయవ్యవస్థపై దాడిగా భావించాలన్నారు. ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరి, నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గ వ్వల శ్రీనివాసులు, నాగరాజు యాదవ్, తిమ్మారెడ్డి, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment