జిల్లా కేంద్రంతోపాటు అయిజ, శాంతినగర్‌లలో 90 శాతం నివాస గృహ నిమిత్తం అనుమతి పొంది వాణిజ్య దుకాణాలు, సముదాయాలుగా నిర్మిస్తున్నారు. నిర్మాణాలకు ఎదుట సెట్‌బ్యాక్ వదలకుండా నిబంధనలను తుంగలో తొక్కి కట్టడాలను చేపట్టారు. వాస్తవానికి నివాస గృహ నిమిత్తం పొందే అనుమతి కంటే వాణిజ్య నిర్మాణానికి సంబంధించిన అనుమతికి మూడింతల సొమ్ము ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆస్తిపన్ను రూపేనా రూ.లక్షల్లో ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. ఈ లెక్కన మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల జేబుల్లోకి చేరిపోతోంది. వీటితో పాటు చాలా మంది జీ+1 అనుమతితో మూడు, నాలుగు అంతస్తులతో పాటు సెల్లార్లు నిర్మిస్తున్నారు. ఇలా జరుగుతున్న నిర్మాణాల వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment