గద్వాల: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. వేసవిలో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అందుకు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా వివిధ రకాల పనులు చేపట్టేందుకు రూ.50కోట్లు విడుదల అయ్యాయని త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో అదనంగా 33 కేవీ, 11 కేవీ ఎల్‌టీ లైన్స్ అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. సమావేశంలో ఎస్‌ఈ తిరుపతిరావు, ఏడీలు రమేష్‌బాబు, గోవిందు, నవీన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment