గజ వాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు
గద్వాలటౌన్: భూలక్ష్మీ చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి 7గంటలకు చెన్నకేశవస్వామి గజవాహనంపై ఊరేగాడు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తులను రాఘవేంద్రస్వామి మఠం వరకు గజవాహనంపై ఊరేగించారు. శేషదాస భజన మండలి సభ్యులు భక్తిగీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. స్వామి వారి దర్శనం చేసుకొని భక్తులు తరించారు.
నేడు సత్యనారాయణస్వామి వ్రతం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ విచారణ కర్త ప్రభాకర్ తెలిపారు. సాయంత్రం చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తులను పెద్ద అగ్రహారంలోని అహోబిల మఠం వరకు అశ్వవాహనంపై ఊరేగింపు ఉంటుందన్నారు.
సైనికుల సేవలు
వెలకట్టలేనివి
గద్వాలటౌన్: శ్రీనగర్‌లోని పుల్వామా వద్ద జరిగిన దాడిలో అమరులైన జవాన్లకు విద్యార్థులు ఘన నివాళులర్పించారు. శుక్రవారం ప్రభుత్వ పీజీ సెంటర్‌తో పాటు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వీరమరణం పొందిన 44 మంది జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా పీజీ సెంటర్ ప్రిన్సిపల్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న సైనికులు సేవలు వెలకట్టలేనివని, వారి వల్లే ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని కొనియాడారు.
‘పెద్ద చింతరేవుల’లో ప్రముఖుల ప్రత్యేక పూజలు
ధరూరు: మండల ంలోని పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ లింగరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాశస్త్యాన్ని వారికి వివరించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి శేష వస్త్రాన్ని అందజేశారు. అర్చకులు కిష్టాచార్యులు, ఆలయ ధర్మకర్త గిరిరావు పాల్గన్నారు.
క్రీడాస్ఫూర్తితో
ఉన్నత శిఖరాలు
గద్వాలటౌన్: ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పద్మావతి, డీవైఎస్‌ఓ జితేందర్ పేర్కొన్నారు. ఈ నెల 20 తేదీ నుంచి 23వ తేదీ వరకు వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలుర, బాలికల కబడ్డీ టోర్నమెంట్‌కు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హజరై క్రీడాకారులను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీలను లక్ష్యంగా నిర్దేశించుకొని ఆడాలని సూచించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరి నర్సింహా, చైర్మన్ అబ్రహాం, రవి, చందు, నగేష్, కరెంటు నర్సింహా, జగదీష్, రైల్వేపాష, రాజశేఖర్ పాల్గొన్నారు.
స్కూటీలు ఇవ్వాలంటూ పోస్టుకార్డు ఉద్యమం
గద్వాలటౌన్: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువతకు ఇచ్చిన ఉచిత స్కూటీ హామీపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థినుల చేత పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. ‘ప్రియాంక జీ వేర్ ఈజ్ స్కూటీ’ అంటూ విద్యార్థులు ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల హామీను అమలు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి కుర్వ పల్లయ్య అన్నారు.
గజ వాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు
Comments
Please login to add a commentAdd a comment