పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనధికార నిర్మాణాలు
‘ఈ చిత్రంలో కనిపిస్తున్న భవన నిర్మాణం.. 34వ వార్డులోని కుంటవీధిలో ప్రజాఅవసరాల కోసం వదలిన పదిశాతం స్థలంలో చేపడుతున్నారు. 266 చదరపు గజాల స్థలంలో నకిలీ డాక్యుమెంట్లతో అనుమతి పొంది, అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ అక్రమ భవన నిర్మాణంపై ఫిర్యాదు చేస్తే, అప్పటి అడిషనల్ కలెక్టర్ అపూర్వ్‌చౌహన్ అనుమతులు రద్దుచేసి, నిర్మాణ పనులు నిలిపివేయించారు. తాజాగా మళ్లీ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి (మాజీ కోఆప్షన్ సభ్యుడు) పనులు ప్రారంభించారు. దీనిపై అధికారుల నుంచి మీసమెత్తు స్పందన లేకపోవడం గమనార్హం. దీనిపై స్థానికులు కోర్టును ఆశ్రయిస్తున్నారు.’
Comments
Please login to add a commentAdd a comment