ప్రజలకు మేమున్నాం అని భరోసానిచ్చే పోలీసుశాఖలో సైతం ఇదే తంతు నడుస్తోంది. చట్టాలు, నిబంధనలు తోసిరాజసి.. తమకు నచ్చిన తీరుతో బాధితులతో ఇష్టానుసారంగా ప్రవర్తి స్తున్నారు. శాంతిభద్రతలు, నేరాల అదుపు పేరుతోనే సివిల్ పంచాయతీలలో తలదూర్చి ‘మాకేంటి లాభమనే’ విధంగా కొందరు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మట్టి, ఇసుక, భూ మాఫియాకు వత్తాసు పలుకుతున్నారనే అభియోగా లు కొన్ని స్టేషన్లపై లేకపోలేదు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఇంటి నిర్మాణాలకు, లేఅవుట్‌లకు, పేరు మార్పిడికి, ఇంటి నంబర్ల కోసం, ఆస్తిపన్ను మదింపు.. ఇలా ప్రతి పనికి అమ్యామ్యాలు ఇవ్వాల్సిందే. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి డాక్యుమెంటుకి, రవాణా శాఖలో ప్రతి లైసెన్స్‌కి రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎకై ్సజ్ శాఖలో నెలవారీ మామూళ్లు అనేది బహిరంగ రహస్యమే.
Comments
Please login to add a commentAdd a comment