ఎన్నాళ్లకెన్నాళ్లకు.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Published Sun, Feb 16 2025 12:51 AM | Last Updated on Sun, Feb 16 2025 12:48 AM

ఎన్నా

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఫలించిన 17 ఏళ్ల ఎదురుచూపులు

హైకోర్టు ఉత్తర్వులతో పోస్టింగులు

కాంట్రాక్టు ఎస్జీటీలుగా అవకాశం

ఉమ్మడి జిల్లాలో 182 మందికి న్యాయం

సర్వీస్‌ కల్పించాలి..

17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే మేమంతా 17 ఏళ్ల సర్వీస్‌ కోల్పోయాం. ఇప్పటికి మాకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఉద్యోగం ఇస్తూ సర్వీస్‌, ఏరియర్స్‌ కల్పిస్తూ.. రెగ్యులర్‌ చేస్తే బాగుంటుంది.

– విజయ్‌కుమార్‌, మద్దూరు

నారాయణపేట/మద్దూర్‌: డీఎస్సీ– 2008 నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఎస్టీటీలుగా వారం రోజుల్లోగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని బాధిత అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నోటిఫికేషన్‌ అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. మెరిట్‌ జాబితాలో ఉన్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ వస్తున్నారు. 17 ఏళ్ల న్యాయ పోరాటం.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ మినిమం టైం స్కేల్‌ వర్తింపజేస్తూ కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. అయితే వీరందరికీ సాధ్యమైనంత త్వరగా పోస్టింగ్‌ ఇవ్వాలని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసినా వివిధ కారణాలతో జ్యాపం జరుగుతూ వచ్చింది.

సర్టిఫికెట్ల పరిశీలన

ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తయింది. ఈ పరిశీలన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5 వరకు కొనసాగింది. తాజాగా కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియామక ఉత్తర్వులను వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధిత అభ్యర్థులు కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియామకం కానున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 182 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయినప్పటికీ నూతన జిల్లాల వారీగానే పోస్టింగ్‌ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతుండగా.. ఖాళీలను బట్టీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల సంఖ్య

జోగుళాంబ గద్వాల50

మహబూబ్‌నగర్‌ 10

డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు

జిల్లాల వారీగా అభ్యర్థులు ఇలా..

నారాయణపేట

50

నష్టపోయాం..

డీఎస్సీ– 2008లో వెలువడిన నోటిఫికేషన్‌ ద్వారా పోటీ పరీక్షల్లో ఎంపికై కౌన్సెలింగ్‌ సమయంలో ట్రిబ్యునల్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా చాలా నష్టపోయాం. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం హర్షణీయం. – బుగ్గప్ప, మద్దూరు

సంతోషంగా ఉంది..

17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. గత 17 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించాను. 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే మాకు అన్యాయం జరిగి.. మళ్లీ అదే ప్రభుత్వంలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. – రవిప్రకాష్‌, నారాయణపేట

వనపర్తి

40

నాగర్‌కర్నూల్‌

32

న్యాయ పోరాటంతోనే..

ఎన్నో సంవత్సరాల పోరాటంతో ఫలించిన అద్భుత క్షణం ఇది. 2008లో డీఎస్సీ రోస్టర్‌లో మా పేర్లు ఉన్నా కొన్ని కారణాలతో ఉద్యోగం రాలేదు. 28 జీఓ ప్రకారం మా ఉద్యోగాలు మాకు రావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఎట్టకేలకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషంగా ఉంది.

– బాలస్వామి, నాగర్‌కర్నూల్‌

కొత్త జిల్లాల వారీగా..

ఇప్పటికై నా ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ, మమ్మల్ని మా స్థానికత ఆధారంగా కొత్త జిల్లాల వారీగా నియమిస్తే బాగుండేది. అలాగే ఎంటీఎస్‌ విధానంలో జీతాలు ఇవ్వకుండా రెగ్యులర్‌ టీచర్ల మాదిరిగానే చెల్లించేలా చూడాలి.

– అరుణ, వనపర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 1
1/5

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 2
2/5

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 3
3/5

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 4
4/5

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 5
5/5

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement