సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయం
గద్వాలటౌన్: సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయమని బీజేపీ నాయకులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి బీజేపీ నాయకులు జయశ్రీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప విప్లవ చైతన్య మూర్తి సంత్ సేవాలాల్ అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవికుమార్‌ఏక్బోటే, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, శివారెడ్డి, దేవదాసు, అనిల్, కృష్ణ, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, ప్రభుత్వ పీజీ సెంటర్‌లో సేవాలాల్ చిత్రాపటానికి కళాశాల ప్రిన్సిపల్ వెంకట్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళుర్పించారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో సంత్ సేవాలాల్ ఒకరని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ తన బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి ఎంతో కృషి చేశారని చెప్పారు.
సంప్రదాయ బద్ధంగా
సుదర్శన ‘చక్ర’ స్నానం
గద్వాలటౌన్: పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య భూలక్ష్మీ చెన్నకేశవస్వామి సుదర్శన చక్రానికి చక్రస్నానం సంప్రదాయబద్ధంగా చేయించారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా శనివారం గద్వాల కోటలోని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి సన్నిదానంలో నిత్యపూజ కార్యక్రమాల అనంతరం స్వామివారికి అవబృత స్నానం గావించారు. ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి పూజ కార్యక్రమం నిర్వహించారు.
వైభవంగా ఊరేగింపు
భూలక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవమూర్తుల ఉరేగింపు వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగించారు. చెన్నకేశవస్వామి ఆలయం నుంచి పురవీధుల గుండా పెద్ద అగ్రహంలోని అహోబిళమఠం వరకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. మఠంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. భజనలు చేస్తూ, భక్తీ గీతాలు ఆలపిస్తు భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం రాత్రి నాగవళీ, దేవత విసర్జన, సర్వసమర్పణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ విచారణ కర్త ప్రభాకర్, మేనేజర్ స్వామిరాయ్ తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరు నాటికి
సర్వే పూర్తి చేయాలి
అలంపూర్: ఈ నెలాఖరు వరకు డిజిటల్ క్రాప్ సర్వేను పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. అలంపూర్ పట్టణంలోని పశు సంవర్ధక శాఖ శిక్షణ భవనంలో అలంపూర్ నియోజకవర్గంలోని మండలాల అధికారులు, విస్తరణ అధికారులకు శనివారం సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. మండలాల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రతి రైతుకు చెందిన పంట వివరాలు, సర్వే నెంబర్‌తో సహా నమోదు చేయాలన్నారు. రైతు బీమాకు సంబందించిన పెండింగ్ ఉంటే నామినీకి సంబందించిన పత్రాలను సమర్పించి వారికి బీమా డబ్బులు అందించేలా చూడాలని, పీఎం కిసాన్, రైతు భరోసా, రుణ మాఫీ సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలన్నారు. అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ యాసంగిలో సాగు చేసిన పంట సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డివిజనల్ వ్యవసాయ సాంకేతిక అధికారి సుబ్బారెడ్డి, వ్యవసాయ శాఖ మండలాల అధికారులు అనిత, సురేఖ, నాగార్జున్ రెడ్డి, సందీప్, జనార్థన్, రవికుమార్, విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయం
సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయం
Comments
Please login to add a commentAdd a comment