జిల్లా కేంద్రంలోని 6వ వార్డు పరిఽధిలోని బసవన్న చౌరస్తా క్రాస్‌రోడ్డులో ప్రజా అవసరాల కోసం వదిలిన పది శాతం మున్సిపల్ స్థలంలో అక్రమంగా వాణిజ్య దుకాణ నిర్మాణాలను చేపట్టారు. గతంలో ఇదే స్థలంలో నిర్మాణాలు చేపడితే అప్పటి మున్సిపల్ అధికారులు అక్రమమని తేల్చి కూల్చివేశారు. తర్వాత చాలాకాలం పాటు నిర్మాణాల జోలికి వెళ్లలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో ఉండటాన్ని గమనించి, ఇదే అదనుగా మళ్లీ వాణిజ్య దుకాణ నిర్మాణాలు చేపట్టారు. అప్పుడు కూడా స్థానికులు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే పనులను నిలిపివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొద్దిపాటి పనులతో దుకాణ నిర్మాణాలు పూర్తయ్యాయి. తాజాగా కబ్జాదారుడు కొంతమంది నాయకులకు ముడుపులు చెల్లించి, రెండు రోజుల క్రితం దర్జాగా దుకాణాలను పూర్తిచేశాడనే అరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment