అలరించిన పద్యనాటక ప్రదర్శనలు
స్టేషన్ మహబూబ్‌నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఆదివారం రెండోరోజు కొనసాగాయి. కోయిలకొండ మండలం అంకిళ్ల గ్రామానికి చెందిన రామాంజనేయ కళానాట్య మండలి కళాకారులు శ్రీరామాంజనేయ యుద్ధ ఘట్టం, శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో దేవేంద్ర సభ, శ్రీకృష్ణ రాయబారం, మిడ్జిల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శ్రీవీరాంజనేయస్వామి నాట్య మండలి ఆధ్వర్యంలో కౌరవసభ, కళాకారుడు ఎ.శ్రీశైలం రావణ ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళానాట్యమండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ మన్యంకొండ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సహకారంతో మంగళవారం వరకు పద్యనాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పద్యనాటక ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. సోమవారం వివిధ సంస్థలచే శ్రీకృష్ణాంజనేయ యుద్ధ ఘట్టం, మయసభ దుర్యోధన నాటకాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.
పోటెత్తిన వేరుశనగ
నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం వేరుశనగ పోటెత్తింది. చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఆదివారం మార్కెట్‌కు ఒక్కసారిగా 10,071 బస్తాల వేరుశనగ తీసుకువచ్చారు. అయితే క్వింటాల్ గరిష్టంగా రూ.6,960, కనిష్టంగా రూ.4,884 ధర వచ్చిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. ఎవరికై నా ఇబ్బందులు కలిగితే వెంటనే వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేయాలని చైర్మన్ లింగం రైతులకు సూచించారు.
ఉద్యోగుల సమస్యలు
పరిష్కరించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడం వల్లే ఉద్యోగులంతా ఏకమై రాష్ట్రంలో ప్రభుత్వ మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాకేంద్రంలోని సంఘం కా ర్యాలయంలో ఆదివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు, పీఆర్‌సీ నివేదికను ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని కోరారు. గత రెండేళ్లుగా ఈ–కుబేర్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లు లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment