పలుకుబడితో సక్రమం
గద్వాల టౌన్: జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఒక టాస్కుఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే టాస్కుఫోర్స్ ప్రధాన లక్ష్యం. అక్రమ నిర్మాణాల విషయంలో ఉన్నతాధికారులు రాజకీయ పలుకుబడి ఉన్న వారికి ఓ విధంగా.. సామాన్యుల నిర్మాణాల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రజలు అధికారుల తీరును ఎండగడుతున్నారు.
నిబంధనలు అతిక్రమించి..
అందరూ టీఎస్ బీపాస్‌లో దరఖాస్తు చేసుకుని నేరుగా అనుమతులు పొందిన తర్వాతే ఇంటి నిర్మాణాలు చేపట్టాలి. కానీ చాలా మంది అవగాహనలేమితో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరూ తెలిసి కూడా అనుమతులు తీసుకోకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ తరహాలో నిర్మించే అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో గత ప్రభుత్వం టాస్కుఫోర్సును ఏర్పాటు చేసింది. ఇది అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలి. కానీ గద్వాల, అయిజ పట్టణాలలో నిర్మాణాలు సక్రమంగా జరగడం లేదు. అందుకు ప్రధాన కారణం రాజకీయ ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధుల పైరవీలతో అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది. ప్రధానంగా గద్వాల, అయిజ మున్సిపల్ పరిధిలో పెద్ద సంఖ్యలో అనుమతి లేని నిర్మాణాలు జరుగుతున్నా.. వాటి గురించి అధికారులకు తెలిసిన పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేని కట్టడాల గురించి ప్రారంభ దశలోనే ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. గత మూడేళ్ల నుంచి అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నా... చర్యలు తీసుకోవడం లేదు.
‘జిల్లా కేంద్రంతోపాటు అయిజ పట్టణంలో అనుమతి లేని కట్టడాలు, అక్రమ నిర్మాణాలపై టాస్కుఫోర్సు అధికారులు కొరఢా ఝులిపించారు. ఇళ్ల నిర్మాణాలతోపాటు ప్రజా
అవసరాల కోసం వదిలిన పది శాతం స్థలంలో పలు సామాజిక వర్గాలకు చెందిన
కట్టడాలను అక్రమ నిర్మాణాలు అని నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. ఎలాంటి సానుభూతి చూపించకుండా చర్యలు తీసుకున్నారు..’
ఇదీ మూడేళ్ల క్రితం మాట.
ప్రస్తుతానికి వచ్చేసరికి.. ‘జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా చాలా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
మున్సిపల్ స్థలాలను ఆక్రమించి కట్టడాలు చేస్తున్నారు. ప్రజా అవసరాల స్థలంలో సైతం యేథేచ్ఛగా ఇళ్లు, వాణిజ్య దుకాణాలను
చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై
అధికారులు ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా
వ్యవహరిస్తున్నారు. పలుకుబడి ఉన్న వాటిపై టాస్కుఫోర్సు బృందం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.’
అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అధికారుల పక్షపాత వైఖరి
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణం
అధికారులకు మొర పెట్టుకున్నా.. చర్యలు శూన్యం
కనిపించని ‘ప్రత్యేక’ మార్క్
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం
అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ స్థలాల కబ్జాపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అట్టి నిర్మాణ పనులను నిలిపివేశాం. మిగిలిన స్థలాలపైనా విచారణ చేసి.. వాటి నివేధికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తాం. అక్రమ నిర్మాణాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
– నర్సింగరావు, అడిషినల్ కలెక్టర్.
పలుకుబడితో సక్రమం
Comments
Please login to add a commentAdd a comment