అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కోడేరు: అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో రూ.25 లక్షలతో నిర్మించే టాయిలెట్స్, డార్మెటరీ, డైనింగ్ హాల్, కస్తూర్బా విద్యాలయంలో రూ.10 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులు, కొండ్రావుపల్లిలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, జనుంపల్లిలో రూ.16 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా పథకాలు అమలు చేసిందన్నారు. త్వరలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వివరించారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్‌రావు, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ కరీం, బావాయిపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌యాదవ్, ఎంపీడీఓ శ్రావణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, ఆది రాజు, రామకృష్ణ, పొండేళ్ల సురేశ్, ఇమ్రాన్, బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment