ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
ఎర్రవల్లి: ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలను సాకారం చేసేందుకుగాను ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ గౌతమ్ అన్నారు. సోమవారం మండలంలోని బట్లదిన్నెలో ఇందిరమ్మ ఫేజ్–1 ఇళ్ల నిర్మాణ పనులను, లబ్ధిదారుల ఇళ్ల స్థలాలను కలెక్టర్ బీఎం సంతోష్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కొత్త ఇళ్ల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మండలంలో ఒక్కో మోడల్ గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. దీనిలో భాగంగా ఎంపికై న మీ గ్రామంలో లబ్ధిదారులు తమ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి లబ్ధిదారుడు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. పునాది నుంచి బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వ నిధులు రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాలోకి మొత్తం రూ. 5లక్షలు నేరుగా జమచేయబడతాయని వివరించారు. మేసీ్త్రలు అందుబాటులో ఉంటారని, పంచాయతీ సెక్రటరీ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు ఫొటోలు తీసుకొని ప్రభుత్వానికి పంపిస్తారని అన్నారు. ఎవరైనా మధ్యవర్తులు డబ్బు కోరితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. పాత ఇళ్ల మరమ్మతు లేదా విస్తరణకు ప్రభుత్వం నిధులను అందించదని తెలిపారు. లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, గృహ నిర్మాణశాఖ చీఫ్ ఇంజనీర్ చైతన్య, ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, కార్యదర్శి నివేష్ పాల్గొన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మేనేజింగ్
డైరెక్టర్ వీ.పీ గౌతమ్
కలెక్టర్‌తో కలిసి బట్లదిన్నె గ్రామం
సందర్శన
Comments
Please login to add a commentAdd a comment