ఆశాజనకంగా.. | - | Sakshi
Sakshi News home page

ఆశాజనకంగా..

Published Wed, Feb 19 2025 1:25 AM | Last Updated on Wed, Feb 19 2025 1:20 AM

ఆశాజన

ఆశాజనకంగా..

జిల్లాలో కూరగాయల సాగు.. భలే బాగు

అంచనా మేరకు..

గతేడాది వానాకాలంలో 3,400 ఎకరాల్లో కూరగాయల సాగు అవుతుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే సకాలంలో వర్షాలు కురవడం వల్ల బోరుబావులు రీచార్జ్‌ కావడంతో 3,600 ఎకరాల్లో కూరగాయలను పండించారు. ఇలా అంచనా కన్నా కొంత ఎక్కువ సాగైంది. ఇక ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి 2వేల ఎకరాల్లో కూరగాయల సాగు అవుతుందని అధికారులు అంచనా వేయగా.. 2,015 ఎకరాల్లో సాగు అయ్యింది. టమాటా, వంకాయ, ఉల్లి, బీర్నిస్‌, క్యాలీఫ్లవర్‌, బెండ ఎక్కువగా వేశారు. అయితే యాసంగి సీజన్‌ ప్రస్తుతం సాఫీగా సాగుతోంది. బోర్లు, బావుల కింద సాగు చేసిన కూరగాయల సాగు ఆశాజనకంగా ఉందని అధికారులు అంటున్నారు. కాగా, టమాటాకు మార్కెట్‌లో ధరలు లేకపోవడం వల్ల చాలా మంది రైతులు పంటను తీసివేశారు. మిగిలిన కూరగాయల పంటలకు ధరలు బాగానే ఉన్నాయి.

గద్వాల వ్యవసాయం: 2023–24 వర్షాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. యాసంగిలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులతో ఆశించిన స్థాయిలో రైతులు కూరగాయలను పండించలేకపోయారు. అయితే 2024–25 వానాకాలం సీజన్‌ రైతులకు కలిసి వచ్చింది. ఉద్యానశాఖ అధికారుల అంచనా మేరకు సాగైంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లోనూ ఆశాజనకంగా సాగుతోంది.

జిల్లాలో విస్తారంగా సాగు..

జిల్లాలో ప్రతి ఏటా సాధారణ పంటలతో పాటు కూరగాయలను విస్తారంగా పండిస్తారు. రెండు సీజన్‌లతో కలిపి దాదాపు 9వేల నుంచి 10వేల ఎకరాల్లో ఇక్కడి రైతులు వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తూ వస్తున్నారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, ధరూర్‌ మండలంలో బెండ, టమాటా, మల్దకల్‌ మండలంలో చిక్కుడు, టమాటా, బీర, సోరకాయ, బెండ, కాకర, అయిజలో బెండ, చిక్కుడు, వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, ఉల్లి, అలంపూర్‌లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, ట మాటా గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటాతో ఆకుకూరలను సైతం సాగు చేస్తారు. తమకున్న పొలంలో రెండు నుంచి ఐదు ఎకరాల్లో బోరుబావుల కింద రైతులు కూరగాయలను పండిస్తున్నారు.

మండలాల వారీగా కూరగాయల సాగు ఇలా..

యాసంగిలో 2,015 ఎకరాల్లో తోటలు

బోరుబావుల కింద జోరుగా సాగుబడి

No comments yet. Be the first to comment!
Add a comment
ఆశాజనకంగా.. 1
1/1

ఆశాజనకంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement