అన్నింటా.. అట్టడుగు
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని సూచించే అక్షరాస్యత, తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ, మౌలిక సదుపాయాల కల్పన ఇలా అన్నింట్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే అట్టడుగున కొనసాగుతున్నాయి. అక్షరాస్యత విషయంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు రాష్ట్రంలోనే వెనకబడే ఉన్నాయి. ఈ జిల్లాల్లో అక్షరాస్యత శాతం కనీసం 50 శాతం కూడా మించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
● పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్స్‌లోనూ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 28.8 శాతం మంది విద్యార్థులు పాఠశాల దశలోనే చదువుకు దూరమవుతున్నారు. ఇక వనపర్తి జిల్లా 8.81 శాతం మంది డ్రాపౌట్స్‌తో కాస్త మెరుగ్గా ఉంది. విద్యార్థులకు, ఉపాధ్యాయుల నిష్పత్తిలోనూ గద్వాల, నారాయణపేట జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరతలో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది.
● తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు చివరి వరుసలో ఉన్నాయి. నారాయణపేట జిల్లా రూ.1,94,962 తో అట్టడుగున ఉండగా.. తర్వాతి వరుసలో జోగుళాంబ గద్వాల జిల్లా కొనసాగుతోంది. అభివృద్ధి పురోగతికి సూచీగా నిలిచే జీఎస్‌డీపీలోనూ నారాయణపేట జిల్లా చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయంలో మహబూబ్‌నగర్ జిల్లా కాస్త మెరుగ్గా మొదటి నుంచి పదో స్థానంలో కొనసాగుతోంది.
ఉపాధి, పరిశ్రమలు కరువు..
ఉమ్మడి జిల్లాలో ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లోనూ వెనుకబాటు కనిపిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో కేవలం 18 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 297 పరిశ్రమలు ఉన్నాయి.
పశుసంపదలో మేటి..
పశుసంపద విషయంలో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే ఉమ్మడి పాలమూరు మేటిగా నిలిచింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా 12.95 లక్షల గొర్రెలతో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. కూలీల సంఖ్య విషయానికి వస్తే గద్వాల జిల్లా 92.2 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. వనపర్తి జిల్లాలో 88.2 శాతం మంది కూలీలు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33.9 శాతం మంది సాగుదారులు ఉన్నట్టు నివేదికలో వెల్లడయింది. రాష్ట్రంలోని మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల తర్వాత నాగర్‌కర్నూల్‌లోనే అత్యధికంగా 21.4 శాతం ఎస్సీ జనాభా ఉంది. హైదరాబాద్, కరీంనగర్ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో తక్కువగా 1.5 శాతం మంది మాత్రమే ఎస్టీలు ఉన్నారు. జాతీయ రహదారుల విస్తరణ విషయంలో నల్లగొండ మొదటిస్థానంలో ఉండగా.. నాగర్‌కర్నూల్ జిల్లా 252.83 కి.మీ., విస్తీర్ణంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది.
సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య)
అక్షరాస్యతలో రాష్ట్రంలోనే చివరన ఉమ్మడి పాలమూరు
గద్వాల, పేటలో 50 శాతంలోపే..
తలసరి ఆదాయంలోనూ
అంతంత మాత్రమే
మౌలిక సదుపాయాల కల్పనలో చివరి వరుసలోనే
తెలంగాణ స్టాటిస్టిక్ రిపోర్టులో వెల్లడి
జనాభా సాంద్రతలో..
(ప్రతి చదరపు కిలోమీటర్‌కు)
అన్నింటా.. అట్టడుగు
అన్నింటా.. అట్టడుగు
Comments
Please login to add a commentAdd a comment