మారని పోలీసు తీరు..!
●
శాఖాపరమైన చర్యలు తప్పవు
పోలీసుశాఖలో ఏ స్థాయి అధికారి తప్పు చేసిన శాఖ పరమైన చర్యలు ఉంటాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం సమూల మార్పులు తీసుకువస్తున్నాం. పేకాట విషయంలో సిబ్బందిపై వచ్చిన ఆరోపణాలపై ఇప్పటికే అనర్హత వేటు వేశాం. సీఐ స్థాయి అధికారులు మొదలుకుని ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల వరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నాం. అన్ని పోలీసు స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ప్రత్యేక విభాగం నిఘా ఉంచింది. వివిధ స్థాయిలో చేసిన తప్పిదాలపై మెమోలు జారీ చేశాం. నాయకులు, ప్రజలు అనే భేదం లేకుండా పోలీసులు సేవలు అందిస్తారు. దళారీ వ్యవస్థలో ఎవరిని సహించేది లేదు. చట్ట పరిధిలో అందరూ సమానమే.
– శ్రీనివాసరావు, ఎస్పీ
● పేకాటరాయుళ్లతో డబ్బులు వసూలు
● క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యం
● ఆరోపణల నేపథ్యంలో పలువురు సిబ్బందిపై వేటు
గద్వాల క్రైం: శాంతిభద్రతలను కాపాడుతూ.. ప్రజలకు మేమున్నామనే భరోసానిచ్చేది పోలీసులు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన పోలీసు శాఖకు కొందరు సిబ్బంది మాయని మచ్చ తెస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారితో చేతులు కలుపుతున్నారు. ఓవైపు ఇసుక, బియ్యం, మట్టి, పేకాట తదితర అసాంఘిక దందాలను కట్టడి చేస్తున్నా.. మరో వైపు అవీనితికి పాల్పడిన వారికి అండగా నిలుస్తూ.. స్థాన చలనం.. అనర్హత వేటుకు గురవుతున్నారు. జిల్లా పోలీసుశాఖలో గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమయ్యాయి.
జిల్లాలోని కొన్ని సంఘటనలు..
● 21.08.2024వ తేదీన అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి పోలీసుస్టేషన్ సమీపంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది పేకాటరాయుళ్లు నిత్యం పేకాట దందాను నిర్వహిస్తుండగా పోలీసులు మెరుపు దాడులు చేపట్టి పలువురిని అరెస్టు చేశారు. అయితే పోలీసు సిబ్బందితోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఈ దాడుల్లో పాల్గొని పేకాటరాయుళ్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. పట్టుబడిన నగదును తక్కువగా చూయించారు. ఈ ఘటనపై విచారించి ఆరోపణలు వాస్తవమని పోలీసు పైఅధికారులు నిగ్గు తేల్చారు. దీంతో మల్టీ జోన్ –2 ఐజీ పీవి.సత్యనారాయణ గద్వాల స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ జములప్ప, ఎస్‌ఐలు విక్రం, శ్రీనివాసులును విధుల నుంచి తొలగించి వీఆర్‌కు ఆటాచ్ చేశారు.
అవినీతి, అక్రమాల్లో కొందరు..
మారని పోలీసు తీరు..!
Comments
Please login to add a commentAdd a comment