గద్వాల విద్యార్థికి ప్రధాని ప్రశంస
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆదికేశవ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ప్రేరణ సదస్సుకు విద్యార్థి ఆదికేశవ్ ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా, అందులో గద్వాల విద్యార్థి ఉండటం విశేషం. దేశ చరిత్ర, సాంస్కృక, స్వాభిమాన్, ధైర్య సహసాలు, పరిశ్రములు, కరుణ, సత్యనిష్ట, నాయకత్వం, విశ్వసనీయత, కర్తవ్యం, సత్యం, అహింసా తదితర అంశాలపై శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ విద్యార్థిని అభినందిస్తూ లేఖ రాశారు. ‘జాతీయస్థాయి ప్రేరణ సదస్సుకు ఎంపికై , అక్కడ నిర్వహించిన శిక్షణలో చక్కటి అంశాలను నేర్చుకోవడం శుభపరిణామం. వాటిని జీవితంలో అవలంభిస్తూ ఆదర్శవంతంగా ఎదగాలి’ అని లేఖలో ప్రస్తావించారు. హెచ్‌ఎం ఇమ్మానియేల్, ఉపాధ్యాయులు.. విద్యార్థిని సన్మానించారు.
మిరపకు మద్దతు
ధర కల్పించాలి
అలంపూర్: ప్రభుత్వం మిరప రైతులకు మద్దతు ధర కల్పించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న డిమాండ్ చేశారు. అలంపూర్ మండలంలోని సింగవరంలో బుధవారం మిరప రైతులను కలిసి పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుత.. ఎకర మిరప పంట సాగుకు రూ.లక్షకుపైగా ఖర్చు చేశారని, కానీ మిరపను విక్రయించేందుకు వెళితే సాగు వ్యయం ఖర్చులు రావడం లేదన్నారు. బహిరం మార్కెట్‌లో విక్రయించేందుకు వెళ్తే క్వింటాల్ ధర రూ.10 వేల నుంచి రూ. 12 వేల వరకు మాత్రమే పలుకుతుందన్నారు. పంట మొత్తం విక్రయించిన కనీసం పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిరప బోర్డును ఏర్పాటు చేయా లన్నారు. క్వింటాల్‌కు రూ. 25 వేల ప్రకటించి కొ నుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నరసింహ్మా, రజాక్, గోపాల్, చిన్న ఈరన్న, బాబు సాబ్, మహమ్మద్, నరసింహులు ఉన్నారు.
నెలాఖరు వరకు
ఆర్డీఎస్‌కు నీరు
శాంతినగర్: ఫిబ్రవరి 28 వరకు ఆర్డీఎస్‌కు సాగు నీరు పుష్కలంగా అందుంతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. వడ్డేపల్లి మండలంలో ప్రవహించే ఆర్డీఎస్ కెనాల్‌లో బుధవారం నీటి ప్రవాహం కొనసాగింది. మరో తొమ్మిది రోజుల పాటు ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీబీ డ్యాంలో నాల్గో ఇండెంట్‌గా పెట్టిన 1.16 టీఎంసీల నీరు బుధవారం ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ రాజోళిబండకు చేరాయని పేర్కొన్నారు. సాయంత్రం ఆనకట్టపై ఇంచు మేర ఓవర్ ఫ్లో కొనసాగుతోందని, గురువారం ఉదయం వరకు ఓవర్ ఫ్లో మరింత పెరిగే అవకాశం వుందన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ సంప్ వద్ద నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఇండెంట్ నీరు గురువారం సాయంత్రం వరకు తుమ్ళిళ్లకు చేరుతుందని, తుమ్మిళ్ల లిఫ్ట్‌కు ఇండెంట్ నీరు నెలాఖరు వరకు అందుతుందని, ఆర్డీఎస్ కెనాల్‌కు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఐదో చివరి ఇండెంట్ 0.8 టీఎంసీలు మిగిలి వుందని, కేసీ కెనాల్‌కు ఇండెంట్ పెట్టిన సమయంలో పెడతామని ఏఈ పేర్కొన్నారు. అంతేగాక ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ రాజోళి బండ షెట్టర్ల నుంచి ప్రధాన కాల్వ ద్వారా విడుదలైన నీరు బుధవారం అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చేరాయని, గురువారం ఉప్పల వరకు చేరుతాయన్నారు.
ఆధ్యాత్మికతతోనే
మానసిక ప్రశాంతత
అయిజ: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోదమయానందాజీ మహారాజ్ అన్నారు. బుధవారం మండలంలోని సంకాపురంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామకృష్ణ ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మనిషి దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత చాలా వసరమని అన్నారు. చిన్ననాటినుంచి ఆధ్యాత్మికత కలిగి ఉండాలని, దానివలన సమాజం భక్తి మార్గం వైపు నడుస్తుందని అన్నారు. అహింసా మార్గాన్ని విడనాడాలని, ప్రతి రోజు ప్రతి ఒక్కరు గంటసేపు ధ్యానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం శర్మ, సూర్య ప్రకాష్, ఉమాదేవి, రాముడు, రాజీవ్, వెకంట్రాములు, కృష్ణ, సత్యనారాయణ, ఈశ్వర్, దామోదర్, ఈశ్వరన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment