ఎస్‌బీఐ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
అలంపూర్: ఎస్‌బీఐ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. అలంపూర్ చౌరస్తాలో ఎస్‌బీఐ బ్రాంచీని బుధవారం ఆయనతోపాటు హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్‌తో కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ నెట్‌వర్క్–2 ప్రకాష్ చంద్ర బరోర్, రీజినల్ మేనేజర్ సునిత, ఆయా గ్రామాల ప్రజలు డిజిటల్ స్క్రీన్‌పై వర్చువల్ ప్రారంభాన్ని వీక్షించారు. అనంతరం సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్‌నాయక్‌తో మాట్లాడారు. ఇక్కడి భూములు, పంటల వివరాలు, పరిశ్రమలు, మిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులకు, ప్రజలకు రుణాలు, సేవల గురించి వివరించారు. ఇదిలాఉండగా, ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిది మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామం. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు అలంపూర్ చౌరస్తాలో ఎస్‌బీఐ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎస్‌బీఐ సేవలు తీసుకొచ్చిన చైర్మన్‌కు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment