రాజోళి: గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని మండలంలోని పెద్దధన్వాడతోపాటు ఇతర గ్రామాల రైతులు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు విన్నవించారు. మండలంలోని పెద్దధన్వాడలో 20 రోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దీక్షలను మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తెలుసుకొని వారిని బుధవారం సెక్రటేరియట్‌లోని మంత్రి కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వారు మంత్రి శ్రీధర్‌బాబుతో మాట్లాడారు. పచ్చని పొలాలు ఉన్న తమ గ్రామాల నడుమ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిని, క్యాన్సర్లు రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు, తాగునీరు కలుషితం అవుతుందని, పొలాల్లో పంటలు పండవని, దిగుబడి తగ్గుతుందని తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో 14 గ్రామాలకు పైగా ప్రత్యక్షంగా ఇబ్బందులు ఎదుర్కోగా, తాగునీటి విషయంలో ఏపీలోని గ్రామాలు సైతం ఇబ్బందులు పడతాయని మంత్రికి తెలిపారు. ఎన్నో గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మంత్రికి తెలిపారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న ఫ్యాక్టరీని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దదన్వాడతో పాటు ఆయా గ్రామాల ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment