తిండికీ తిప్పలే..
నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత
కారం, తొక్కులే నిత్య భోజనం..
నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు.
● నిత్యం కారం, తొక్కులే ఆహారం
● చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనీమియా సమస్య
● గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు
‘నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న రాంపూర్‌పెంటకు చెందిన గర్భిణి బయమ్మ(25)ను ఇటీవల డెలివరీ కోసం జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి ఆమెకు హిమోగ్లోబిన్
4 శాతమే ఉన్నట్టు గుర్తించారు. రక్తం ఎక్కించడంతో పాటు అత్యవసర చికిత్స అందించి డెలివరీ చేశారు. అయితే 8 రోజుల అనంతరం పుట్టిన శిశువు చనిపోయాడు.’ ఇలా నల్లమలలో రక్తహీనత సమస్యతో అధికశాతం చెంచు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనీమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్‌ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి.
బర్త్ వెయిటింగ్ సెంటర్లతో ప్రయోజనం..
చెంచుపెంటల్లోని మహిళలకు రేషన్‌బియ్యం, పప్పులు, గుడ్లు తదితర ఆహారం అందించేందుకు అప్పాపూర్‌లోని ఏకై క అంగన్‌వాడీ కేంద్రమే ప్రధాన దిక్కుగా మారింది. ఇక్కడి నుంచి 20, 30 కి.మీ. దూరంలో ఉన్న చెంచుపెంటలకు సరుకుల రవాణా జరగడం లేదు. అంగన్‌వాడీల ద్వారా ప్రతి చెంచుపెంటల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఇంటింటా కూరగాయల మొక్కలతో కిచెన్‌గార్డెన్‌ను ప్రోత్సహించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రక్తహీనత సమస్యతో గర్భిణులు, శిశు మరణాలను తగ్గించేందుకు బర్త్ వెయిటింగ్ సెంటర్లను నెలకొల్పి, అవసరమైన వారిని ముందస్తుగా అక్కడి తరలించి పౌష్టికాహారం, చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
చెంచుల
జనాభా
8,784
చెంచు
కుటుంబాలు
2,595
నల్లమలలో
చెంచుల
ఆవాసాలు: 88
సీ్త్రలు: 4,443
పురుషులు: 4,341
తిండికీ తిప్పలే..
Comments
Please login to add a commentAdd a comment