ముక్కు మూసుకోవాల్సిందే..
వడ్డేపల్లి మున్సిపాలిటీలో ప్రధానంగా కొత్త కాలనీలు, అలాగే సీసీరోడ్లు నిర్మించి డ్రెయినేజీలు నిర్మించకుండా వదిలేసిన కాలనీల్లో మురుగు పారేందుకు వీలు లేక కాలనీలు దుర్గందభరితంగా మారాయి. ఇంట్లో నుంచి బయటికి వచ్చారంటే ముక్కు మూసుకోవాల్సిందే. రాఘవేంద్ర హైస్కూల్ పరిసర ప్రాంతాలు, 5, 6వ వార్డులు, బోయ కాలనీ, గోకారమయ్య దర్గా, దస్తగిరయ్య కాలనీల్లో డ్రెయినేజీలు అధ్వానంగా మారాయి. అంతేగాక శాంతినగర్–రాజోళి రోడ్డులోని ప్రధాన డ్రెయినేజీ కాల్వలో చెత్తాచెదారం పేరుకుపోయింది. మురుగు ముందుకు కదలక కంపు కొడుతోందని ఇందిరానగర్, జమ్ముల మడుగు కాలనీవాసులు వాపోతున్నారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులు స్పందించి ఇబ్బందికరంగా వున్న కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు నిర్మించి, కాల్వలు శుభ్రం చేయించి, చెత్తాచెదారం తొలగించి ఇబ్బందులు లేకుండా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment