ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలి
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేందుకు మేసీ్త్రలు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం పీజేపీ క్యాంపులో పాత కలెక్టరేట్ సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో మేసీ్త్రలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రూ.5లక్షలతో అందించే ఇందిరమ్మ ఇళ్లను ఉత్తమ నాణ్యతతో నిర్మించాలన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మేసీ్త్రలకు రోజుకు రూ.300 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. శిక్షణ ద్వారా కొత్త రకమైన నిర్మాణ పద్ధతులు, మెరుగైన సామగ్రి వినియోగం, భద్రతా ప్రమాణాలు వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం మేసీ్త్రలకు టీషర్ట్స్, కిట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో హౌసింగ్ శాఖ జిల్లా అధికారి భాస్కర్, డీఈ నరేందర్, ఏఈ ప్రకాష్, శివశంకర్, మేసీ్త్రలు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే లేఅవుట్ల అభివృద్ధి
ప్రభుత్వ నిబఽంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల మున్సిపాలిటీలోని సర్వే నంబర్లు 898, 900, 93 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఅవుట్లు ఏర్పాటు చేసే క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని,ల్యాండ్ డెవ్‌లప్‌మెంట్ ప్రణాళికకు అనుగుణంగా మౌళిక వసతులు సమకూర్చాలని సూచించారు. సర్వే నంబర్ 898, 900, 93లలో లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. అంతర్గత రహదారులు, ప్రతిఇంటికి తాగునీటి కనెక్షన్, సేవరేజీ లైన్, స్ట్రామ్‌వాటర్ డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్(ఎస్‌టీపీ), విద్యుత్ సదుపాయం, అప్రోచ్ రోడ్లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఓపెన్ స్థలాలను పచ్చదనంతో అభివృద్ధి చేసి ప్రహరీ నిర్మాణాలు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీనివాసరావు, టౌన్‌ప్లానింగ్ అధికారి కురుమన్న, తహసీల్దార్ మల్లీఖార్జున్, ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment