‘మురుగు’పాలిటీలు..! | - | Sakshi
Sakshi News home page

‘మురుగు’పాలిటీలు..!

Published Wed, Mar 12 2025 7:55 AM | Last Updated on Wed, Mar 12 2025 7:50 AM

‘మురు

‘మురుగు’పాలిటీలు..!

పురపాలికల్లో అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు

అలంపూర్‌లో శాశ్వత పరిష్కారం కరువు..

అలంపూర్‌ మున్సిపాలిటీ ప్రజలు నిత్యం డ్రైనేజీ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రంతోపాటు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పటికీ డ్రైనేజీ సమస్య కొలిక్కి రావడం లేదు. గతంలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు వెచ్చించి దాదాపు దశాబ్దకాలం పాటు పనులు కొనసాగించారు. కానీ, డ్రైనేజీ నిర్మాణానికి శాశ్వత పరిష్కారం లభించలేదు. అంతర్గత డ్రైనేజీలో భాగంగా కాలనీల్లో మ్యాన్‌హోల్స్‌ ఏర్పాటు చేశారు. డ్రైనేజీ కాల్వలు సైతం చిన్నగా ఉండటంతో నిరంతరం కాల్వలు నిండి మ్యాన్‌ హోల్స్‌ ద్వారా మురుగు రోడ్లపైకి వస్తుంది. దీంతో కాలనీల్లో ఎక్కడో ఒక చోట మ్యాన్‌ హోల్స్‌ ద్వారా మురుగు బయటికి వచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. అలాగే, వాహనాల రాకపోకలకు, నడచి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రదేశాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. వీటికి తోడు కందకాల సమస్య తీవ్రంగా ఉంది. కందకాల్లో వర్షపు నీరు, మురుగు నిలిచి నిరంతరం దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికై నా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అలంపూర్‌ మున్సిపల్‌ ప్రజలు కోరుతున్నారు.

డ్రైనేజీలను శుభ్రం

చేయడం లేదు

డ్రైనేజీలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడం లేదు. ఒక చోట శుభ్రం చేస్తూ మరోచోట వదిలేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయాన్ని పలుసార్లు పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. వ్యర్థాలు, చెత్తాచెదారంతో డ్రైనేజీలన్ని పూడకుపోయి దుర్గందభరితంగా మారాయి.

– వెంకటరమణ, గద్వాల

దుర్వాసన వెదజల్లుతోంది

మున్సిపాలిటీలోని 14వ వార్డులో డ్రైనీజీ నిర్మించకపోవడంతో మురుగు ఇళ్ల పక్కన నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి నిలబడలేని పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసి వెళ్తారు కానీ డ్రైనేజీ నిర్మించలేదు. కనీసం మురుగు ముందుకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి.

– మాలన్‌బీ, అయిజ

పునాదుల్లోకి నీరు వస్తుంది

మున్సిపాలిటీలోని కొత్తపేటలో మురుగు నిలిచి ఉండడంతో చుట్టుముట్టు ఉన్న గుడిసెలు, ఇళ్ల పునాదుల్లోకి మురు చేరుకొని గోడలు బీటలు పారుతున్నాయి. గతంలో గుడిసె కూలి చిన్నారి మృతి చెందింది. డ్రైనేజీ నిర్మించాలని అధికాలకు, పాలకులకు చెబుతుంటే నిధులు లేవంటున్నారు.

– వెంకటమ్మ, అయిజ

అధికారులు పట్టించుకోవట్లే..

మా ఇంటి ముందు రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుంటుంది. కాలు బయటపెడదామంటే మురుగు నీటిలో నడిచి వెళ్లాలి. సమీపంలోని కాలనీలో సీసీ రోడ్డు వేశారు. మా కాలనీలో సీసీ రోడ్డు వేయలేదు. ఇంటి పన్నులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మాకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పట్టించుకోరు. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు మా కాలనీకి వచ్చి చూసి సీసీ రోడ్డు, డ్రెయినేజీ కాల్వ నిర్మించాలి.

– రామేశ్వరమ్మ,

5వ వార్డు, వడ్డేపల్లి మున్సిపాలిటీ

అయిజలో పడకేసిన

పారిశుద్ధ్యం

అయిజ మున్సిపాలిటీలోని అనేక కాలనీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చాలా కాలనీల్లో డ్రైనేజీలు శిథిలం కావడంతో మురుగు ఎక్కడికక్కడే నిలిచి ఆ పరిసరాలు కంపు కొడుతున్నాయి. ముఖ్యంగా మడ్డి గుంతకాలనీ, టీచర్స్‌ కాలనీ, గాజుల పేట, కొత్తపేట, భరత్‌నగర్‌ కాలనీల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. ప్రధానంగా కాలనీల్లో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మరుగు ముందుకు పారడంలేదు. దీంతో దోమల ఉధృతి ఎక్కువై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, త్వరితగతిన సీసీ రోడ్లు నిర్మించి ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే పట్టణంలో అన్ని కాలనీల్లో డ్రైనేజీలు నిర్మించేందుకు సుమారు రూ.20 కోట్ల నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయిజ మున్సిపాలిటీలో నిధులు లేవు. నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

గద్వాల టౌన్‌/అలంపూర్‌/అయిజ/శాంతినగర్‌: కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా మారింది మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల తీరు చూస్తే. వర్షం నీరు, వరదనీరు సాఫీగా వెళ్లడానికి నిర్మించిన వరద, మురుగునీటి కాల్వలతో పాటు డ్రైనేజీలు ఇష్టానుసారంగా నిర్మించడంతో సమస్య జఠిలంగా మారుతున్నాయి. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో కొత్త కాలనీల్లో డ్రెయినేజీ నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు రహదారులపై పారుతుండడంతో కాలనీలు దుర్గందభరితంగా మారుతున్నాయి. వరాహాలు, దోమల వ్యాప్తిచెంది ప్రజలు అనారోగ్యం బారినపడి ఆస్పత్రుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. ప్రత్యేకాధికారుల పాలనలో అయినా అసంపూర్తి డ్రెయినేజీలు పూర్తి చేసి మురుగుకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రణాళిక లేకుండా

పనులతో అవస్థలు

గద్వాల పట్టణ పరిధిలోని పలు వార్డులలో డ్రైనేజీలు అధ్వానంగా మారాయి. కృష్ణవేణి చౌరస్తా నుంచి సత్యసాయి మందిరం వరకు ఉన్న పెద్ద డ్రైనేజీలో పూడిక పేరుకుపోయింది. కుంటవీధిలోని డ్రైనేజీలు సైతం దుర్గందంగా మారాయి. సుంకులమ్మమెట్టు, కుంటవీధి, ఓంటెలపేట, గంటగేరి, వడ్డేగేరి, చింతలపేట తదితర ప్రాంతాల్లో పూడిక, వ్యర్థాపదార్థలు పేరుకుపోయి డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. పట్టణ ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న మురుగు, వరద నీటి కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు ప్రణాళికా ప్రకారం వ్యవహరించలేదు. దీంతో అందులోని మురుగు వెళ్లకుండా నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో మురుగు, వర్షం నీటిని మళ్లించడానికి తప్పనిసరిగా కల్వర్టులు నిర్మించాల్సి ఉన్నా ఎక్కడికక్కడే మురుగు కాల్వలు మూసివేశారు. కూరగాయల మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న కల్వర్టులు, రాజీవ్‌ సర్కిల్‌లో ఉన్న డ్రైనేజీ పూర్తిగా మూసుకుపోయాయి. రద్దీగా ఉండే ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలలో దుకాణ దారులు డ్రైనేజీలను కూడా ఆక్రమించారు. డ్రైన్లపై పక్కాగా స్లాబ్‌లు కూడా వేసుకొని తమ షాపుల ముందు పార్కింగ్‌ కోసం, ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో డ్రైనేజీలలో పేరుకపోయిన పూడికను తీయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది సైతం హడావుడిగా పనులు చేసి చేతులు దులుపుకొటున్నారు. మరికొన్ని చోట్ల పూడికతీత పనులే ప్రారంభించలేదు. రాబోయే రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ మరీ దుర్భరంగా మారనుందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రహదారులపై పారుతున్న మురుగు

దోమల విజృంభణ.. రోగాల భారినపడుతున్న జనం

జిల్లాలోని నాలుగు

మున్సిపాలిటీల్లో ఇదే దుస్థితి

No comments yet. Be the first to comment!
Add a comment
‘మురుగు’పాలిటీలు..! 1
1/7

‘మురుగు’పాలిటీలు..!

‘మురుగు’పాలిటీలు..! 2
2/7

‘మురుగు’పాలిటీలు..!

‘మురుగు’పాలిటీలు..! 3
3/7

‘మురుగు’పాలిటీలు..!

‘మురుగు’పాలిటీలు..! 4
4/7

‘మురుగు’పాలిటీలు..!

‘మురుగు’పాలిటీలు..! 5
5/7

‘మురుగు’పాలిటీలు..!

‘మురుగు’పాలిటీలు..! 6
6/7

‘మురుగు’పాలిటీలు..!

‘మురుగు’పాలిటీలు..! 7
7/7

‘మురుగు’పాలిటీలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement