ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం
గద్వాలటౌన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాల్లో 4,235 మంది విద్యార్థులకు గాను 4,080 మంది హాజరయ్యారు. 155 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. 3,415 మంది జనరల్ విద్యార్థులకు గాను 3,304 మంది, 820 మంది ఓకేషనల్ విద్యార్థులకు గాను 776 మంది హాజరైన వారిలో ఉన్నారు. విద్యార్థులు నిర్ణీత గడువుకు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోగా.. అధికారులు తనిఖీ చేసి అనుమతించారు. అయితే పరీక్ష కేంద్రాల్లోని కొన్ని గదుల్లో వెలుతురు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. మరికొన్ని గదుల్లో ఫ్యాన్ల కొరత కనిపించింది. ఎండ తీవ్రత, ఉక్కపోత కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇక్కట్లకు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ కెమెరాల నీడలో పరీక్షలు జరిగాయి. కేంద్రాల్లో తాగునీటి సమస్య లేకుండా జాగ్రతలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా ఇంటర్ విద్యాధికారి హృదయరాజు, ఇతర అధికారుల బృందాలు వేర్వేరుగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను తదితరులు ఉన్నారు.
మొదటి రోజు 155 మంది విద్యార్థులు గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment