పాలమూరు: కృష్ణా బేసిన్‌లోని అన్ని జిల్లాలలో నీటి వాటా కోసం కృష్ణానది జలసాధన జేఏసీలు ఏర్పాటు చేసి పోరాడాల్సిన అవసరం ఉందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు హరగోపాల్, కన్వీనర్ రాఘవాచారి గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు నిధులు అన్నింటిని ఆంధ్ర ప్రాంతాల్లో వెచ్చించి, కృష్ణానది జలాల దోపిడీకి పాల్పడ్డారని ఆ క్రమంలో ఎన్నో పోరాటాలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ వచ్చినా.. పార్టీల అధికారం మారినా.. స్థానిక రైతులకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ తెలంగాణకు నీటి వాటా పంపిణీ చేయలేదని, గత ప్రభుత్వం కేంద్రంతో పోరాడి నీటివాటా సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల గడుస్తున్నా కృష్ణానది జల సాధనకు కృషి చేయడం లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment