హత్య కేసుపై డీఎస్పీ, సీఐల విచారణ
గట్టు: ఓ హత్య కేసుకు సంబందించి నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా.. సదరు నిందితుడి స్వగ్రామం లింగాపురంలో గద్వాల డీఎస్పీ మొగులయ్య, శాంతినగర్ సీఐ టాటాబాబు, ఎస్‌ఐ శ్రీనివాస్, అయిజ, గట్టు ఎస్‌ఐలు రాజశేఖర్, మల్లేష్ గురువారం విచారణ నిర్వహించారు. శాంతినగర్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసుకు సంబందించి లింగాపురం గ్రామానికి చెందిన ఉత్తనూర్ నర్సింహులు నిందితుడు. ఇతను జైలులో ఉండగా.. విచారణ నిమిత్తం పోలీసులు కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకున్నారు. ఈమేరకు లింగారానికి చేరుకొని నిందితుడి పూర్తి వివరాలు ఆరా తీశారు.
1,018 అడుగుల
నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం 1,018 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదన్నారు. ఎన్టీఆర్ కాల్వకు 84 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 119 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వాణిజ్యశాస్త్ర విభాగం విద్యార్థులకు ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ చెన్నప్ప మాట్లాడుతూ బ్యాంకింగ్, బీమా, వ్యాపార, వాణిజ్య వంటి అంశాలను ఎన్ను కుని క్షణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇలాంటి ప్రాజెక్టుల పరిశోధనల ద్వారా విద్యార్థుల వికాసం, సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ రాజ్‌కుమార్, అనురాధారెడ్డి, రంగప్ప, సురేష్ పాల్గొన్నారు.
ఆరుగురికి పదోన్నతి
మహబూబ్‌నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 పరిధిలో ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇస్తూ గురువారం డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి వచ్చిన వారిలో చిన్ను నాయక్, బాలయ్య, బి.రాజు, వి.నాగరాజు, ఎం.వెంకటయ్య, రాములు, రాజేషం ఉన్నారు. వీరికి ఉమ్మడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్‌లు కేటాయించారు.
ఆయుధ పరిజ్ఞానం
పెంపొందించుకోవాలి
వనపర్తి: విధుల్లో వినియోగించే ఆయుధాలపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లిలోని 10వ బెటాలియన్‌లో గురువారం ఉదయం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మూడురోజుల ఫైరింగ్ శిక్షణ నిర్వహించారు. పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒక్కొక్కరు పది రౌండ్లు కాల్చే అవకాశం కల్పించారు. ఎస్పీ స్వయంగా పాల్గొని జిల్లా సాయుద దళాల అదనపు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఫైరింగ్ శిక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుధాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని, శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వర్తించవచ్చన్నా రు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి జీవ న విధానాన్ని అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు, పోలీసుశాఖకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, డ్యూటీలో ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సైబర్‌క్రైం డీఎస్పీ రత్నం, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, రిజర్వ్ ఎస్‌ఐలు వినోద్, ఎండీ మొగ్ధుం, జిల్లాలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment