హైలెవల్ బ్రిడ్జిపైనే ఆశలు..
గతంలో కాజ్‌వే శిథిలావస్థకు చేరుకొని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం కలెక్టర్ బీఎం సంతోష్ దృష్టికి వెళ్లగా.. ఆయన నేరుగా కాజ్‌వేను సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కాజ్‌వే పూర్తిగా శిథిలమైందని, వాహనాలు వెళ్తే ప్రమాదమని పేర్కొంటూ.. తాత్కాలికంగా కాజ్‌వేకు మరమత్తులు చేసి వేసవి కాలంలో కాజ్‌వేను కూల్చివేసి దాని స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. అయినా సరే ఇప్పటి వరకు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ముందడుగు పడడంలేదు. ఇదిలాఉండగా, అత్యవసర వైద్య సేవలైన కాన్పులు, రోడ్డు ప్రమాద బాధితులను నిత్యం అయిజ నుంచి ఏపీ రాష్ట్రంలోని కర్నూలుకు అంబులెన్స్‌లలో తరలిస్తుంటారు. కాజ్‌వే పూర్తిగా శిథిలం కావడంతో అంబులెన్స్ వాహనాలు గద్వాలకు చేరుకొని అక్కడ నుంచి జాతీయ రహదారిపై కర్నూలుకు వెళ్తుండడంతో అత్యవసర సేవలు ఆలస్యం కావడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment