గద్వాల: నీట్ యూజీ–2025 పరీక్షను అత్యున్నత ప్రమాణాలతో పకడ్బందీగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పాలిటెక్నిక్ కాలేజీలను నీట్ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయటానికి ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన గదుల్లో వసతులు, సీటింగ్ కెపాసిటీ, సీసీటీవీ నిఘా, టాయిలెట్లు, వెంటి లేషన్ తదితర అంశాలను పరిశీలించి పాఠశాల అధ్యాపక బృందానికి అవసరమైన సూచనలు చేశారు. నీట్ పరీక్షా మార్గదర్శకాలను అనుసరించి విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. అదేవిధంగా ప్రశ్నపత్రాల భద్రతాలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు అందించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు ఇమ్మన్యూల్, జహీరుద్దీన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment