మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
గద్వాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని, అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఎక్త్సెజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రితోపాటు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై మొదట సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలందరికీ ముందుగా మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజా సంక్షేమం, మహిళల అభ్యున్నతి కొరకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని, వాటిని ఎదుర్కొనేలా దైర్యంగా మహిళలు ఉండాలన్నారు. చిన్న వయస్సు నుంచి పిల్లలకు మంచి విషయాలు, సమాజంపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రధానంగా ఐదు విషయాలపై శ్రద్ద వహించాలని అవి చదువు, ఆరోగ్యం, సమయపాలన, సాంప్రదాయం, నడవడిక అని అన్నారు. బాలురతో సమానంగా బాలికలను చదివించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, విధిగా ఒక గంటపాటు వ్యాయామం చేస్తే వ్యాధుల భారిన పడకుండా తప్పించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ఉద్యోగులు. మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లాస్ధాయి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment