సామాజిక మార్పుతోనే విజయం
గద్వాల క్రైం: తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుతోనే ప్రతి మహిళ అన్ని రంగాల్లో విజయం సాధిస్తుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇంటా, బయట ఎదుర్కొనే సమస్యలు, లైంగిక దాడులు, సమస్యల వలయంలో ఎందరో మహిళలు ఉన్నారన్నారు. ఇలాంటి వాటిపై ప్రతి ఒక్కరు చైతన్యం కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రతి ఏటా మహిళల దినోత్సవం నిర్వహించడం కంటే లింగ వివక్ష లేకుండా అందరు సమానమేనని గుర్తిస్తే ఎంతో మంచిదన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం పనిచేస్తుందని అన్నారు. బాధింపపడ్డ మహిళలు, విద్యార్థినుల కోసం భరోసా కేంద్రం సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ రజిత, భరోసా సిబ్బంది శివాని, శిరిష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment